అగ్నిధారన్యూస్ కామారెడ్డి:
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి.రామేశ్వర్ పల్లి శివారులో ఓ యువకుడు మంగళవారం ఉదయం దారుణ హత్యకు గరయ్యాడు మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు కామారెడ్డి రూరల్ దేవునిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.రంగం లోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.మృతుడు ఆరెపల్లి గ్రామానికి చెందిన బోయ నవీన్ (25) ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు ఉదయం తన తల్లి తండ్రులను పొలం వద్ద వదిలి ఆటో పై ఇంటికి వెళ్తున్న సమయం లో గుర్తు తెలియని వ్యక్తులు నవిన్ పై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేసి.పారిపోయారు.పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి హత్యకు గల కారణాలు తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నామని కామారెడ్డి రూరల్ సి ఐ. రామన్ తెలిపారు.
