అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని రేగడిమద్దికుంట జిల్లా పరిషత్ పాఠశాలలో ఉగాది పండుగను పురస్కరించుకొని సుద్దాల గ్రామానికి చెందిన ప్రజానేత విజయ్ రావు తన తాతగారి స్మారకార్థం లక్ష్మణరావు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సుద్దాల గ్రామానికి చెందిన పలు క్రికెట్ టీములకు విజయరావ్ టాస్ వేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాలని, క్రీడాకారులలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించి వారిని గుర్తించాలని ఉద్దేశంతోఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గెలుపొందిన జట్లకుబహుమతులు ప్రధానం చేశారు. అనంతరం స్వయంగా భోజనాలు కూడా ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు విజయ్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ద పెళ్లికి చెందినప్రజా నాయకుడుపడాల సతీష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
