అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామానికి చెందిన పోగుల రాయమల్లమ్మ శనివారం రోజున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే తన దగ్గరి బంధువు దగ్గర తన అవసరాల నిమిత్తం అప్పు చేసిందని అప్పు తీర్చమని పలు మార్లు వేధించడంతో నిన్న ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో హుటాహుటిన కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఈరోజు తెల్లవారుజామున ఆమె మరణించిందని ఆమె అల్లుడు శ్రీనివాసు తెలిపారు. వేధింపులకు గురి చేయడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించడంతో ఆత్మహత్య చేసుకుందని ఆయన తెలిపారు. ఇదే విషయంఐ సుల్తానాబాద్ ఎస్ ఐ శ్రావణ్ కుమార్ ను సంప్రదించగా తమకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.
