అగ్నిధార ,న్యూస్ మంథని:

బుధవారం రోజున KDCC శత వసంత వారోత్సవాల వేడుకల్లో భాగంగా మంథని మునిసిపాలిటీ పరిధి లోని పోచమ్మ వాడలో బ్యాంక్ వారు ఖాతాదారులకు బ్యాంక్ యెక్క ఆవశ్యకత మరియు నగదు రహిత లావాదేవీల పైన బ్యాంకు లమీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపెల్లి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు పుట్ట మధుకర్ ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగినది జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ రైతులు పెద్ద మొత్తంలో కేడీసీసీ బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని రుణాలను అవసరాలకు అనుగుణంగా తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారూ. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ  సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్  ఎంపీపీ కొండ శంకర్  బ్యాంకు డైరెక్టర్ గుజ్జుల రాజి రెడ్డి  మరియు కౌన్సిలర్లు సీఈవో అశోక్ కుమార్ సమ్మయ్య ఇంకా పెద్ద మొత్తంలో రైతులు పాల్గొనడం జరిగింది