అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:

సుల్తానాబాద్ పట్టణంలో చోటు చేసుకున్న లారీ ప్రమాదం బీభత్సం సృష్టించింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీ పూసాల మూల మలుపు వద్ద నుండి సంగీత మొబైల్ స్టోర్ వరకు పలు వాహనాలను, గప్చుప్ బండిని ఢీకొనడంతో పాటు పలువురు పాదాచారులను ఢీకొనడంతో  ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి అని ఇందులో ముగ్గురు సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.