అరాచకాలు భరించలేకపోతున్నాం.

అవమానాలు సహించలేకపోతున్నాం.

మానసికంగా వేధిస్తుండు.

మాట వినకుంటే హింస తప్పదు.

పంచాయతీ కార్యదర్శులను మనుషులుగా చూస్తుండు.

మెమోల పేరుతో డబ్బులు వసూలు.

విందుల పేరుతో కాలక్షేపం..

ఎంపీఓపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు.

అగ్నిధారన్యూస్ కలెక్టరేట్: అధికారి అంటే ధైర్యాన్ని ఇవ్వాలి, తన కిందిస్థాయి అధికారులు తెలిసి తెలియక చేసిన తప్పులను పునరావృతం కాకుండా, అనుక్షణం పరిశీలిస్తూ, పర్యవేక్షణ చేస్తూ, మార్గదర్శకంగా ఉండాలి.అవేమి నాకు సంబంధం లేనట్టు తన ఆధీనంలో పనిచేసే 34 మంది పంచాయతీ కార్యదర్శులను గత సంవత్సర కాలంగా, అధికార దర్పంతో భయభ్రాంతులకు గురి చేస్తున్న మంథని మండల పంచాయతీ అధికారిపై, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తిరుగుబాటు బహుట ఎగురవేశారు. పూర్తి వివరాలు….గురువారం రోజు మంథని మండలంలో పనిచేసే  పంచాయతీ కార్యదర్శులు 34 మంది ముక్కుముడిగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చి మంథని మండల పంచాయతీ అధికారి ఆరిఫ్ హుస్సేన్ పై లిఖితపూర్వకంగా… స్థానిక సంస్థల కలెక్టర్ అరుణ శ్రీ కి ఫిర్యాదు చేశారు.

 పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ…

మంథని మండలంలో గత సంవత్సర కాలంగా ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న ఆరిఫ్ హుస్సేన్, అరాచకాలు భరించలేకపోతున్నామని, ప్రతి కార్యదర్శిని మానసికంగా వేధిస్తున్నాడని, అవినీతి అక్రమాలకు తావిచ్చే విధంగా ఆయన విధానాలు ఉన్నాయని, మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పంచాయతీ కార్యదర్శి తను చెప్పిన పని ఏదైనా వినాల్సిందే, లేదంటే పంచాయతీ కార్యదర్శులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మనోవేదనకు గురిచేసి రాక్షసానందం పొందుతాడని, ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను గురించి మాట్లాడుతూ, మానసిక స్థైర్యం దెబ్బతినేలా,మానసికంగా వేధిస్తూ, హింసిస్తాడని, లొంగ తీసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడని,ఆందోళన వ్యక్తం చేశారు. మెమోల పేరుతో డబ్బులు వసూలు చేస్తాడని ఆరోపించారు. పైఅధికారుల పేరు చెప్పి పైసల్ వసూలు చేస్తారన్నారు. ప్రతిరోజు మండలంలో విందులతొ కాలక్షేపం చేస్తాడన్నారు. రెగ్యులరైజేషన్ సమయంలో ప్రతి పంచాయతీ కార్యదర్శి వద్దనుండి వేలాది రూపాయలు వసూలు చేశాడని ఆరోపించారు. లేడీ పంచాయతీ కార్యదర్శుల విషయానికి వస్తే వారితో మాట్లాడే విధానం వ్యంగ్యాస్త్రాలతో, ద్వందర్థాలతో ఉంటాయని పలువురు మహిళ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సమయపాలన పాటించకుండా రాత్రి పగలు తేడా లేకుండా ఫోన్లు చేసి వేధిస్తాడని ఆరోపించారు. ఏది ఏమైనా మంథనిని ఎంపీఓను జిల్లాలో మరే మండలాకి బదిలీ చేసిన అక్కడ కూడా ఈయన అరాచకాలు తప్పవని పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. సమగ్ర విచారణ చేపట్టి జిల్లా నుండి బదిలీ చేయాలని అన్నారు.

మంత్రి నియోజకవర్గంలో, జడ్పీ చైర్మన్ ప్రాతినిథ్యం వహించే మంథనిలో ఎంపీ ఓ ఏ అధికారుల ధైర్యంతో ఈ పాడు పనులు చేస్తున్నాడో….? అధికారులకే తెలియాలి…

నేడు మంథని ఎంపీఓపై విచారణ..

గురువారం రోజు పంచాయతీ కార్యదర్శులు పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కి ఎంపిఓపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. స్పందించిన అధికార యంత్రాంగం మంథని మండల స్పెషల్ పెద్దపల్లి జిల్లా పరిషత్ సీఈవో నరేందర్ ను విచారణ అధికారిగా నియమించినట్లు విశ్వాసనీయ సమాచారం.
మంథని మండలంలో శుక్రవారం రోజు ఎంపీఓపై విచారణ చేయనున్నట్లు తెలిసింది. అధికారుల విచారణలో ఏమి తేలుతుందో వేసి చూడాల్సిందే.