ఎంపీఓపై కలెక్టర్ కు ఫిర్యాదు

అగ్నిధారన్యూస్ కలెక్టరేట్ గురువారం రోజు మంథని మండలం లో పనిచేసే  పంచాయతీ కార్యదర్శులు ముక్కుముడిగా కలెక్టరేట్ కేంద్రానికి తరలివచ్చి ఎంపీఓ ఆరిఫ్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ… గత సంవత్సర కాలంగా ఎంపీఓ అరాచకాలు భరించలేకపోతున్నామని, ప్రతి కార్యదర్శిని మానసికంగా వేధిస్తున్నాడని, అవినీతి అక్రమాలకు తావిచ్చే విధంగా ఆయన విధానాలు ఉన్నాయని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీఓ మాట వినని పంచాయతీ కార్యదర్శులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మనోవేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా మంథని ని ఎంపీ ఓ ఈ జిల్లాలో ఉండవద్దని జిల్లాలో వేరే మండలా కి బదిలీ చేసిన అక్కడ కూడా ఈయన అరాచకాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. మెమోల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పై అధికారులు  విజిట్ కి వస్తున్నారని పెట్రోలు చార్జీలు వసూలు చేస్తుంటారు అన్నారు. ప్రతిరోజు మండలంలో  విందులతొ కాలక్షేపం చేస్తాడన్నారు. రెగ్యులరైజేషన్ సమయంలో ప్రతి పంచాయతీ కార్యదర్శి వద్ద వేలాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. లేడీ పంచాయతీ కార్యదర్శుల విషయానికి వస్తే వారితో మాట్లాడే విధానం వ్యంగ్యాస్త్రాలతో ఉంటాయని పలువురు మహిళ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సమయపాలన పాటించకుండా రాత్రి పగలు తేడా లేకుండా ఫోన్లు చేసి వేధిస్తాడని ఆరోపించారు.