అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ పట్టణంలోని జవహర్ నగర్ లో పశువుల కోసం నిల్వ ఉంచిన పశుగ్రాసం దాదాపు 500 గడ్డి కట్టలు ప్రమాదవశాత్తు అంటుకొని పూర్తిగా దగ్ధం అయ్యాయి.ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పి వేశారు. పెద్దపల్లి ఫైర్ ఆఫీసర్ దేవానంది శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ మున్సిపల్ లోని జవహర్ నగర్ లో నరహరి నరసయ్య కు చెందిన గడ్డి కట్టలు ప్రమాదవశాస్తూ అంటుకున్నాయి. పశువుల కోసం ఈ గడ్డి కట్టలను ఒక రూమ్ లో పెట్టారు. ఈరోజు ఉదయం ఏడు గంటలకు మంటలు రావడంతో ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయడంతో సకాలంలో స్పందించి వెంటనే వచ్చి పూర్తిగా మంటలను చుట్టూ ఇల్లు ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకొని మంటలను ఆర్పి వేశారు.ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ హెడ్ కానీస్టేబుల్ బి.మహేందర్ రెడ్డి ఫైర్ కానిస్టేబుల్స్ శ్రవన్ కుమార్, ప్రవీణ్ కుమార్ ,కొట్టే శ్రీనివాస్ డ్రైవర్ చంద్రయ్య పాల్గొన్నారు.
