అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా:

 పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో కాకతీయుల 13 శతాబ్దం కాలం నాటి త్రికుటాలయం ఉంది ఈ ఆలయ నిర్మాణానికి ఎర్రనీ రాతిని ఉపయోగించారు గోపురానికి ఇటుకలను ఉపయోగించారు ఈ ఆలయం నాక్షేత్రకరపు ప్రదక్షణ పీఠాన్ని కలిగి ఉంది ఆలయం మండపంలో కళ్ళను అబ్రపరిచే విధంగా పుష్పల శైలి ఉంది అద్భుతమైన కళా నైపుణ్యంతో స్తంభాలు ఉన్నాయి పెద్ద గర్భగృహం ఇరువైపులా ఉప గర్భగృహాలు ఉన్నాయి అంతేకాకుండా దేవాలయనికి ప్రధానంగా ఆకర్షణీగా నిలిచేది నంది రెండు అడుగుల ఎత్తు అద్భుతమైన హారాల కళా నైపుణ్యంతో ఉంది కాకతీయుల కాలంలో దేవాలయాలు దైవానికి మాత్రమే కాకుండా కళా, సామాజిక,సాంస్కృతిక, మతపర ,విషయాలకు కూడా ఉపయోగపడేది


శత్రు దుర్భేద్యమైన కోట…

నందిమేడారానికి ప్రత్యేకమైన విశేషం ఉంది త్రికుటాలయం వెనకాల శత్రు దుర్భేద్యమైన బురుజు 30 అడుగుల ఎత్తులో ఉంది ఇవి కాకతీయుల కాలంలో రక్షణ వ్యవస్థకు ఉపయోగపడింది ఇది వారి సైనిక భద్రత వ్యవస్థకు ప్రతీక,ఈ కోటలో ద్వారం  బురుజు పైభాగానికి వెళ్లడానికి మెట్లు మార్గం ఉంది ఈ బురుజు ప్రస్తుతం చాలా వరకు కూలిపోయి ఉంది.

యువ చరిత్ర పరిశోధకుడు సాయి కుమార్

శత్రు దుర్భేద్యమైన కోటలను ఎందుకు నిర్మించారు తెలంగాణలో ప్రధానంగా కోటలు గుట్టలల్లు ఎత్తు ప్రాంతాల్లో ఉంటాయి శత్రువుల ఉనికిని పసిగాట్టడానికి అనువైన ప్రదేశం ఎత్తు ప్రాంతాలు శత్రువులపై ప్రతి దాడి చేయడానికి అవకాశం ఎక్కువగా ఎత్తు ప్రాంతాల్లో ఉంటుంది.