అగ్నిధార న్యూస్,( రామగుండం): పెద్దపల్లి జిల్లా 8 వ కాలనీ వసుందర విజ్ఞాన వికాస మండలి 31 వార్షికోత్సవాల సందర్భంగా వివిధ రంగాలకు చెందిన కవితల పోటీలు. వ్యాసరచన పోటీలు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి స్ఫూర్తి అవార్డులు ఇస్తు అందులో భాగంగా తెలంగాణ సాధన ఉద్యమంలో తన వంతుగా పోలీసు ఉద్యోగాన్ని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమకారుడిగా . యువతకు చాలామందికి రాజ్యాంగం గురించి అంబేద్కర్ ఇజం గురించి తెలియపరచడం బోధించడం , సేవా తత్పరుడిగా 63 సార్లు రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలవడం. రక్తదానాలు. నేత్రదానాలపై యువతకు అవగాహన విద్యార్థులకు చేయూతనివ్వడం, పేదవారికి ఆపద సమయంలో ఆర్థిక సహాయం నిత్యవసరకుల పంపిణీ. చలివేంద్రాల ఏర్పాటు. చెట్లను నాటడం. పర్యావరణం పై అవగాహన కల్పించడం. హాస్పిటల్లో ఉన్న వారిని ఆదుకోవడం. సాంస్కృతిక, భక్తి కార్యక్రమాలలో పాల్గొంటూ వారికి స్ఫూర్తినివ్వడం. గత మూడు దశాబ్దాలుగా ఇలా మహోన్నతమైన సేవ కార్యక్రమాలు చేయడం ద్వారా గుర్తింపు పొందిన డాక్టర్ దేవీ లక్ష్మీ నరసయ్యను వసుంధర విజ్ఞాన వికాస మండలి స్ఫూర్తి అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది.