రోడ్డుపై ధర్నా చేస్తూ నిరసన తెలుపుతున్న నాయకులు బంధువులు.

రైస్ మిల్ ఓనర్స్ దిగిరావాలన్న నాయకులు.

అత్యాచారంచేసి హత్య చేసిన నిందితున్ని అప్పజెప్పాలి అంటున్న కుటుంబ సభ్యులు.

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కాట్నపల్లీ గురువారం రాత్రి అత్యాచారంతో పాటు హత్య గురైన బాలికను సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్ మార్టమ్ నిమిత్తం బాలికను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం అందుకున్న వివిధ పార్టీల నాయకులు ఆస్పత్రి గేటు వద్దకు చేరుకోవడంతో ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు నాయకులను సముదాయిచేందుకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముగ్గురు ఎస్ఐలతో పాటు సుల్తానాబాద్ సీఐ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన అమానవీయ సంఘటనకు, చాలామంది నాయకులతోపాటు  మహిళలు కోపోదృక్తులు అయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ బాలిక తల్లి ఏడ్చిన తీరు పలువురుని కంటతడి పెట్టించింది. రాజివ్ రహదారిపై ధర్నా నిర్వహించిన నాయకులు బాలికను అత్యాచారం చేసిన వారిని తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.  ఉపాధి కోసం రైస్ మిల్లులో పనికి వచ్చిన వారందరికీ ఆడ,మగ తేడా లేకుండా ఒకే దగ్గర వసతి ఏర్పాటు చేయడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని  రైస్ మిల్లులలో ఇదే విధంగా వసతి ఏర్పాటు చేస్తున్నారని పలువురు నేతలు వాపోయారు. రైస్ మిల్లు యాజమాన్యం దిగిరావాలని, రాజీవ్ రహదారిపై కూర్చున్నారు. అభం,శుభం తెలియని బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన కామాంధున్ని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎంత నచ్చ చెప్పినప్పటికీ వాళ్లు శాంతించలేకపోయారు. గట్టి బందోబస్తు మధ్య సుల్తానాబాద్ పోలీసులతోపాటు కాల్వ శ్రీరాంపూర్ జూలపల్లి పోలీసులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.