రెండు పడక గదుల ఇండ్ల వద్ద మౌళిక సదుపాయాల కల్పన.

2బీ.హెచ్.కె పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.

కూనారం రోడ్డులో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఇండ్ల పరిశీలన.

పెండింగ్ ధరణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి.

సుల్తానాబాద్ మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

.….జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

అగ్నిధారన్యూస్,పెద్దపల్లి//సుల్తానాబాద్:జూన్-25:

రెండు పడక గదుల ఇండ్ల వద్ద లబ్ధిదారులకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పన పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
మంగళవారం  పెద్దపల్లిలోని కూనారం రోడ్డు వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి సందర్శించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పూర్తిస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, నిర్మాణ పనుల పురోగతి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ….

కూనారం రోడ్డు వద్ద గల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయిందని, చివరి దశ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం వద్ద లబ్ధిదారులకు అవసరమైన మౌళిక వసతుల పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మున్సిపల్ సంప్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించి మున్సిపల్ అధికారులకు అప్పగించాలని కలెక్టర్ తహసీల్దారును ఆదేశించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయానికి త్రాగునీటి సరఫరా కోసం మిషన్ భగీరథ పైప్ లైన్ వేయాలని, ఈపనుల ప్రతిపాదనలు రూపొందించి వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ సుల్తానాబాద్ మండలం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుల్తానాబాద్ కార్యాలయంలో పెండింగ్ ధరణి దరఖాస్తుల వివరాల గురించి ఆరా తీశారు. పెండింగ్ లో ఉన్న టిఎం 33, పిఓబి వివిధ దరఖాస్తులను రెండు రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. మండలంలో సర్వే కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తు సర్వే వారం రోజుల లోపు పూర్తి చేయాలని కలెక్టర్ సర్వేయర్ ను ఆదేశించారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, తహసిల్దార్ రాజ్ కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.