అగ్నిధారన్యూస్ అదిలాబాద్
గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బిజెపి నేత అదిలాబాద్ మాజీ ఎంపీ, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రమేష్ రాథోడ్ ఈరోజు ఉదయం అనారోగ్య సమస్య తీవ్రతరం కావడంతో అదిలాబాదు నుండి హైదరాబాద్ కు తరలించే మార్గమధ్యలో ఆయన మృతి చెందారు. ఆయన మరణంతో ఒక్కసారిగా కార్యకర్తలు అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. అలాగే ఆయన మృతి పట్ల బిజెపి ముఖ్య నేతలు నివాళులర్పించారు.
