వైద్యశాఖ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి )
పెద్దపల్లి మండలం, గౌరెడ్డిపేట గ్రామ ప్రజలకు విష జ్వరాలు వ్యాపిస్తున్న విషయం తెలుసుకున్న, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్థానిక వైద్య శాఖ అధికారులతో కలిసి బుధవారం రోజు గ్రామాన్ని సందర్శించి ప్రజలకు విష జ్వరాలు రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విష జ్వరాల గురించి వైద్యలతో మాట్లాడి, తగిన జాగ్రత్త చర్యలు వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. డాక్టర్ల సూచనలు అన్ని గ్రామ ప్రజలు పాటించాలని, తమ తమ ఇంటి పరిసరాలలో నీటిని నిలువ ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అలాగే, డాక్టర్లు కింది స్థాయి వైద్య సిబ్బంది ప్రజలకు ఎల్లపుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..
గౌరెడ్డిపేట గ్రామంలో విష జ్వరాలు వ్యాపిస్తున్న విషయం నా దృష్టికి రాగ, బుధవారం రోజున ఉదయం వైద్య అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించి ప్రజల పరిస్థితులు తెలుసుకొవడం జరిగిందన్నారు. అపరిశుభ్ర వాతావరణంలో ఇంటి పరిసరాలు ఉండరాదు అన్నారు. పంచాయతీ అధికారులు, పక్కాగా తడి పొడి చెత్తా సేకరణ గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా చేపట్టాలన్నారు. ప్రజలకు సీజనల్ వ్యాధుల పైన అవగాహన కల్పించాలని అధికారులు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఉన్నత వైద్యాధికారి, గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్య అధికారులు, అశా వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



