ఎక్సైజ్ శాఖ ఎక్కడుందో తెలియదు…

కల్తీ మద్యం జరుగుతున్నట్టు అనుమానాలు..

సిండికేట్ వ్యవస్థకు అంతం లేదా…?

మద్యం ప్రియులకు ఫుల్లుగా కిక్కు రావాలని కల్తీ మద్యం విక్రయిస్తున్నట్టు సమాచారం.!

అడ్డు అదుపు లేకుండా పర్మిట్ రూములు.

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:

ఒక్కసారి బ్రాందీ షాపు చేజిక్కించుకుంటే చాలు రెండేళ్ల కాల వ్యవధిలో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా మద్యం ప్రియులకు కల్తీ మద్యం తాగించడం కోసం శతవిధాల పోటీ పడుతూ కల్తీ మద్యం విక్రయిస్తున్నట్టు అనేక ఆరోపణలు వస్తున్నా గానీ సుల్తానాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో నామమాత్రంగా దాడులు జరుగుతున్నట్టు ప్రజలు మద్యం ప్రియులు  ఆరోపిస్తున్నారు. దీంతో బ్రాందీ షాపు యజమానులు సిండికేట్ గా ఏర్పడి అక్రమంగా నాలుగు చేతుల సంపాదిస్తున్నరని సిండికేట్ దందా రాజులు ధనార్జన లక్ష్యంగా లక్షలు గుమ్మరించి వైన్స్ షాపులను తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ప్రజల్లో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే వైన్ షాపుల పక్కకు ఏర్పాటుచేసిన పర్మిట్ రూములలో మద్యం తాగేందుకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ మంచినీళ్లు, సోడా, వెజ్, నాన్ వెజ్ ,స్నాక్స్ ఇతర అన్ని రకాల అమ్మకాలతో వైన్ షాప్ యజమానుల సహాయంతో పర్మిట్ రూముల యజమానులు లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు సమాచారం..? ఇంత జరుగుతున్నా సుల్తానాబాద్ ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన వైన్స్ షాపు యజమాని ఎంట్రీతో ఒక్కసారిగా వైన్స్ షాపులలో మద్యం ప్రియులకు కావలసిన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకుండా పోయాయని మద్యం బాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వైన్ షాపులలో కల్తీమద్యం జరుగుతున్నట్టు మద్యం ప్రియులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..? సుల్తానాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్న చాలా గ్రామాలలో సిండికేట్ దందాను మానిటరింగ్ చేస్తున్నట్లు సమాచారం. సిండికేట్ దందాను అడ్డుకోకుండా అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వేసవికాలంలో మంచి బ్రాండ్ గల మధ్యాన్ని బెల్ట్ షాపులకు తరలించి వైన్ షాపులలో ఆ బ్రాండ్ లేకుండా చేసి బెల్ట్ షాపులలో 160 కి లభించే బీరు 200 ల చొప్పున అక్రమంగా వసూలు చేయించాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అదే తంతు కొనసాగుతున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఓవ్యక్తి సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసన్నలలో ఈ దందా నడవడం వెనకాల రహస్యం మామూళ్ల కథేనని మద్యం ప్రియులు గుసగుసలాడుతున్నారు…? దీనిపై జిల్లా ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారులుతక్షణమే చర్యలు తీసుకొని ప్రతి మద్యం షాపును నిత్యం తనిఖీలు చేయాలనీ మండల ప్రజలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.