అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్:
ప్రబలుతున్న సీజనల్ వ్యాధులతో చుట్టుపక్కల మండలాలైన కాల్వశ్రీరాంపూర్, ఓదెల,ఎలిగేడు నుండి చాలామంది రోగులు సుల్తానాబాద్ లోని ప్రభుత్వ వైద్యశాలలో గల 30 పడకల ఆసుపత్రి ఉండడంతో నిత్యం ఉదయం ఓపి సేవల కోసం రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య శాఖ మంత్రి జిల్లావైద్యాధికారులు , స్థానిక ప్రజాప్రతినిధులూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి, రోగుల పట్ల శ్రద్ధ చూపాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ సుల్తానాబాద్ లోని *ఓపి సేవల* విభాగానికి చెందిన కొందరు అధికారులు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నట్లు పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఓపి సేవల కోసం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల *ఓపిసేవ* లోని విభాగానికి చెందిన అధికారులు సమయానికి రాకపోవడంతో, అసలే అనారోగ్యం బారిన పడి వస్తే, గంటల తరబడి వేసి ఉండాల్సి వస్తుందని రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఉండాల్సిన, అధికారులు, శనివారం ఉదయం 10:46 గంటలు కూడా, ఓపిసేవ విభాగంలో ఏ ఒక్కరు లేకపోవడం ఇందుకు సాక్ష్యంగా చెప్పవచ్చు. వాతావరణంలో మొదలైన మార్పుల వల్ల ఆస్పత్రికి రోగాలు వస్తుండడంతో ఓపి సిబ్బంది లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తూ ఆర్థిక భారంతో అప్పుల పాలవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య శాఖ అధికారులు స్పందించి, తగిన సమయానికి ఓపి సేవలు ప్రారంభమయ్యేలా చూసి, రోగుల పట్ల శ్రద్ధ చూపాలని చుట్టుపక్కల హాస్పిటల్ కి వచ్చిన రోజులు డిమాండ్ చేస్తున్నారు. ప్రశ్నించిన రోగుల పట్ల ఈ విభాగానికి చెందిన కొంతమంది అధికారులు మేము ఇలానే వస్తాము అని జవాబు ఇస్తుండడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఇటువైపు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

