తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.!

ఆందోళనలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు…!

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా:

తెలంగాణలో పెన్షన్ రికవరీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల నుంచి పింఛన్ రికవరీ చేయాలని ఆదేశం. అనర్హుల జాబితాను సేకరించి అధికార యంత్రాంగానికి పంపిన ప్రభుత్వం…ఒక్క భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలోనే 200 మంది ఆసరా లబ్ధిదారుల నుంచి పింఛన్ సొమ్ము రికవరీ చేయాలని ఆదేశం.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు ఆసరా పథకం పేరిట పింఛన్ పంఫిణీ చేసిన గత ప్రభుత్వం.వృద్ధులకు,ఒంటరి మహిళలకు,చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, బీడీ వర్కర్లకు ఆసరా కింద రూ. 2016, దివ్యాంగులకు రూ. 4,116 ఆర్థిక సాయం అందించిన గత ప్రభుత్వం..తాజాగా చేయూత పేరిట రాష్ట్రవ్యాప్తంగా వృద్ధ్దులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్‌ బాధితులకు 4,000, దివ్యాంగులకు 6000 పంపిణీ చేయాలన్న యోచనలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం..డైరెక్టరీ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంటెట్స్ విభాగం నుంచి ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల వివరాలను సమగ్ర కుటుంబ సర్వే డేటాతో సరిపోల్చి చూసిన ప్రభుత్వం.. ప్రభుత్వం నుంచి పెన్షన్ రూపంలో లబ్ధిపొందుతూనే అదనంగా ఆసరా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులను గుర్తించిన ప్రభుత్వం సేకరించిన వివరాలను క్షేత్రస్థాయి యంత్రాంగానికి పంపి పింఛన్ రికవరీకి నోటీసులు జారీ చేయాలని ఆదేశించడంతోనోటీస్ అందించిన ఏడు రోజుల్లో తీసుకున్న పింఛన్ మొత్తం చెల్లించాలని లేని పక్షంలో ప్రభుత్వం నుంచి పొందుతున్న అన్నిరకాల పెన్షన్లను నిలుపుదల చేయాలని ఆదేశం..కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 42 మంది ఆసరా లబ్ధిదారులకు పెన్షన్ రికవరీ నోటీసులు జారీ..దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలు గతంలో పొందిన 1,72,928 రూపాయల పింఛన్ సొమ్ము తిరిగి చెల్లాంచాలని నోటీస్ జారీ చేశారు.ఇలా రెండు రకాలుగా ఫించన్ తీసుకుంటున్న వారిలో భయం మొదలైందనే చెప్పవచ్చు.