డా శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తాజా మాజీ సర్పంచ్ గంగుల పద్మ మల్లేష్ యాదవ్.
అగ్నిధారన్యూస్ (కొడిమ్యాల) కొడిమ్యాల మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో ఆదివారం రోజున గ్రామ పంచాయతి ఆవరణలో, జగిత్యాల పట్టణంలోని జంబిగద్దే చౌరస్తాలో గల శ్రీపావని మల్టీస్పేషాలిటీ హాస్పిటల్ వారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన లబించింది. సుమారు 350 మందికి మధుమేహం, బీపీతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతోనే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు శ్రీపావని మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ కు చెందిన వైద్యులు డా. శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్నారు. చాల మందికి వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు. అందుకే ప్రజల అవసరాలకు తగిన రీతిలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో జగిత్యాల పట్టణంలో జంబిగద్దే చౌరస్తాలో శ్రీపావని మల్టీస్పేషాలిటీ హాస్పిటల్ స్థాపించడం జరింగిందని అన్నారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ గంగుల పద్మ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ, తమ గ్రామంలో ఉచితంగా వైద్య శిభిరం నిర్వహించి ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమని, డా. శ్రీకాంత్ రెడ్డికి గ్రామ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెట్పెల్లి హరేంధర్, సోమయ్య, సత్యం, హాస్పిటల్ సిబ్బంది బూరుగు ప్రభాకర్, వొల్లాల జలంధర్, శ్రవణ్ ,రాధ, నరేష్,మారుతి తదితరులు పాల్గొన్నారు.

