అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కాట్నపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బతుకు దెరువు కోసం హైదరాబాద్ కు వెళ్లగా ఇటీవల ఆయన బంధువులు చనిపోవడంతో తిరిగి గ్రామానికి రెండుసార్లు రాగా శనివారం రోజున జ్వరం రావడంతో సుల్తానాబాద్ సివిల్ హాస్పిటల్ లో చికిత్స కోసం సోమవారం రక్త పరీక్షలు నిర్వహించిగా డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధారించారు.ఈరోజుగర్రెపల్లి వైద్యాధికారి DR. అనుదీప్, ఆధ్వర్యంలో ఇండ్లలో పైరంత్రం స్ప్రే, కాలువలో అబేట్ స్ప్రే, క్లోరినేషన్ , పాగింగ్ జరిగింది.వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి తిరిగి పీవర్ సర్వేచేసి నీటి నిలువలు పారబోయించి,జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త లు గురించి ప్రజలకు తెలియ చేశారు.అనారోగ్య సమస్య లు ఉన్నవారికి మందులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిని అరికట్టడంలో ప్రజలు సహకరించాలని, ఈ వ్యాధిచాప కింద నీరుల వ్యాపిస్తుందని, ప్రతి ఒక్కరు కాచి వడబోసిన నీరును తాగాలని, ఆరు బయట లభించే తిను బండారాలు తినకూడదని, చిన్నపాటి జ్వరాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో MPDO దివ్య దర్శన్ రావు పంచాయతీ కార్యదర్శి శంకర్,అంగన్వాడీ టీచర్స్ కనక లక్ష్మి, స్వప్న, గ్రామ పంచాయతీ సిబ్బంది వెంకన్న పాల్గొన్నారు.