రక్షణ చర్యల నిర్లక్ష్యం మూలంగానే ఓసిపి టు లో ఇద్దరు కార్మికుల మృతి
కార్మికుల మృతికి రక్షణ అధికారులదే పూర్తి బాధ్యత
సింగరేణి యాజమాన్యం ఎంతమంది కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది
మృతుల కుటుంబాలకు బ్యాంకు ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు చెల్లించి చేతులు దులుపుకోవడం కాదు
ఐదు కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియాను బేషరతుగా చెల్లించాలి.
IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్, ఎస్ కే యాకూబ్ షావలి డిమాండ్.
అగ్నిధారన్యూస్, సింగరేణి కోల్ బెల్ట్ న్యూస్:
బుధవారం రోజు ఓపెన్ కాస్ట్ టూలో మట్టి పేల్లలు కూలి పిట్టర్ కార్మికుడు ఉప్పు వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ కార్మికుడు విద్యాసాగర్ ల మృతికి ఓసిపి టు రక్షణ అధికారుల నిర్లక్ష్యమే స్పష్టంగా కనబడుతున్నది అని IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్ అన్నారు. గత మూడు రోజులుగా వర్షం కారణంగా ఓసిపి2లో మట్టి కుప్పలు అంతా ఎక్కడ ఏమవుతుందో తెలియని పరిస్థితిలో కార్మికులతో అత్యంత నిర్లక్ష్యంగా పని చేయించడం మూలంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది అన్నారు. దీనికి రక్షణ అధికారులదే పూర్తి బాధ్యత వహించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU డిమాండ్ చేసింది. ఆర్భాటంగా ప్రకటించిన కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులుపు కోకుండా నిండు ప్రాణాల మృతికి కారణమైన ఓసిపి టు రక్షణ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబాలకు ఐదు కోట్ల రూపాయల ఎక్స్గ్రేషన్ బేషరతుగా గా చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యల అమలు ఉల్లంఘనల మూలంగా ఇంకా ఎంత మంది కార్మికుల ప్రాణం బలి తీసుకుంటుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యల అమలను పటిష్టంగా అమలు జరపాలని డిమాండ్ చేశారు.

