కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీహర్ష
అగ్నిధారన్యూస్, (పెద్దపల్లి జిల్లా) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా పంచాయతీ శాఖలో పనిచేస్తున్న 13 మంది ఎంపీఓలకు గాను 12 మంది ఈనెల 18 గురువారం రోజు జిల్లాలోని ఆయా మండలాలకు బదిలీ కాగా, జిల్లాలోని 267 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు గాను, 263 మందిని ఆయా గ్రామ పంచాయతీలకు శుక్రవారం రోజు బదిలీ చేశారు. పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు 40శాతం నిబంధన మేరకు గ్రేడ్ 1, గ్రేడ్ 2 గ్రేడ్, 3 గ్రేడ్ 4, పంచాయతీ కార్యదర్శులకు కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉండగా, జిల్లాకలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 267 గ్రామ పంచాయతీలకు గాను 263… పంచాయతీ కార్యదర్శులకు శుక్రవారం రోజు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ అరుణశ్రీ, జిల్లా పరిషత్ సీఈవో నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత కౌన్సిలింగ్ నిర్వహించి స్థానచలనం కల్పించారు. వివిధ కారణాలతో జిల్లాలోని నాలుగు గ్రామపంచాయతీలకి కౌన్సిలింగ్ నిర్వహించలేదు. శనివారం రోజు 263 మంది పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్ ఆర్డర్ ఇస్తున్నట్లు తెలిసింది. నిన్న జరిగిన బదిలీల ప్రక్రియలో డి ఎల్ పి ఓ వేణుగోపాల్ జిల్లా ఈ పంచాయతీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎంపీ రజాక్, గోపి, శిల్పా తదితరులు పాల్గొన్నారు.











