Oplus_0

కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ.

అగ్నిధారన్యూస్ ( సుల్తానాబాద్ ) సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఎస్.వి.ఆర్ గార్డెన్ లో శనివారం రోజున పట్టణంలోని,మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 59 మంది కళ్యాణ లక్ష్మి, 9 షాది ముబారక్ 68,07,888 /- లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్విరామంగా ప్రజల కోసం పనిచేస్తుందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు పరుస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు ఐదు లక్షలు రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీ ని 10 లక్షల రూపాయలకు పెంచామని 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ను అందిస్తున్నామని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఇందిరమ్మ గృహాలు అర్హులైన ప్రతి ఒక్క నిరు పేదకు అందిస్తామని స్పష్టం చేశారు. పది సంవత్సరాల కాలంలో హామీలే తప్ప అమలు చేసింది లేదని ఇండ్లు ఇచ్చిన పాపాన పోలేదని రైతు రుణమాఫీ పై అవాక్కులు చేవాక్కులు పేల్చారని, ఇప్పుడేమని సమాధానం చెప్తారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని గత ప్రభుత్వం తమ కార్యకర్తలకే పథకాలను అందించిందని కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తుందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇసుకను నిలిపివేసామని తెలిపారు. మాటలు చెప్పే ప్రభుత్వం కాదని చేతల్లో చేసి చూపిస్తామని అన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా తమకు ఫోన్ చేస్తే స్పందిస్తామని గ్రామాలలో సైతం తమ నాయకులు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తారని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లతో పాటు లబ్ధిదారులు పలువురు పాల్గొన్నారు.