అగ్నిధారన్యూస్ (రామగిరి మండలం)

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట్ గ్రామ శివారులో గుడుంబా తయారుకు సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది. స్థానిక ప్రదేశంలో 18 లీటర్లు గుడుంబా ను స్వాధీనం చేసుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. పెద్దపెల్లి జిల్లా రామగుండం కమీషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల బేగంపేట్ గ్రామం కంచర చెరువు ప్రాంతంలో గుడుంబా తయారు చేస్తున్నారు.అనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారుల ఆదేశాల ప్రకారం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఏలియా, మహేందర్,కానిస్టేబుల్స్ చంద్రశేఖర్,సునీల్, రాజేందర్ లు వెళ్లి తనిఖీ చేయగా అక్కడ సుమారు 1000 లీటర్లు గుడుంబా తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లం పానకం గుర్తించడం జరిగింది.అదేవిధంగా 18 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గుడుంబా తయారీ చేస్తున్న నిందితుడు బొంతల రమేష్,బేగంపేట్, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి పారిపోవడం జరిగింది.తదుపరి విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్న 18 లీటర్ల గుడుంబాను స్థానిక రామగిరి పోలీస్ స్టేషన్ సిబ్బందికి అప్పగించడం జరిగింది.అనంతరం 1000 లీటర్ల గుడుంబా తయారీకి సిద్ధం గా ఉన్న బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగింది.