నీటితో ఇబ్బందులు ఎదురైతే సమాచారం అందించండి.
అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:
గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుభాష్ నగర్ లో రోడ్లు జలమయం కావడంతో తక్షణమే మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మీ అక్కడికి చేరుకొని మున్సిపల్ సిబ్బందితో సమస్యపై తగు చర్యలు తీసుకోవడం జరిగింది. దీంతో మున్సిపల్ అధికారులు జెసిబి సహాయంతో రోడ్డుపై ఉన్న నీరును ప్రక్కల కు కచ్చా ట్రైన్ తీసి నీరు రోడ్డుపై నిలువకుండా చర్యలు చేపట్టారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ… వర్షాకాలం దృష్ట్యా రహదారులపై అలాగే కాలనీలలో ఇండ్లకు నీరు చేరితే తక్షణమే మున్సిపల్ కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గుంతల వద్ద, విద్యుత్ స్థంబాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని, ముందస్తు చర్యలు చేపడుతున్నామని అన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని శిధిలావస్థకు చేరిన ఇండ్లలో ఎవరు నివసించవద్దని వర్షాల కారణంగా అవి కూలిపోయే ప్రమాదం ఉంటుందని సూచించారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ కట్ల వేణుమాధవ్ తో పాటు సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

