తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం.

అత్యవసర పరిస్థితులలో కంట్రోల్ రూమ్ నెంబర్ 18005995459, +91 80084 69511లకు సమాచారం ఇవ్వాలి.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, జూలై 21:-

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, జిల్లాలో ఉన్న పొంగుతున్న వాగులు , నిండి ఉన్న చెరువు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల కారణంగా ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కూలిపోయే ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితులలో కంట్రోల్ రూమ్ నెంబర్ 18005995459, +91 80084 69511 ల ను సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.