గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం.

పెద్దపల్లి ఎసిపి G.కృష్ణ.

రైల్వే స్టేషన్ బస్టాండ్ లలో పోలీసుల తనిఖీలు.

అగ్నిధారన్యూస్,( పెద్దపల్లి)
నేరాలు నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా, వినియోగం నియంత్రణ ముందస్తు చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ పెద్దపల్లి డీసీపీ చేతన ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, పర్యవేక్షణ లో పెద్దపల్లి సిఐ కృష్ణ, ఎస్సై లక్ష్మణరావు, ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసిపి కృష్ణ మాట్లాడుతూ…. పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో స్థానిక బస్టాండ్ లో యువత, ప్రజల ఆరోగ్యం ప్రాణాలకు హాని కలిగించే గంజాయి, మాదకద్రవ్యాల వంటి వాటిని అరికట్టడం, రవాణా, నియంత్రణ లో భాగంగా నార్కోటిక్ ట్రయినింగ్ స్నిఫర్ డాగ్‌ , స్పెషల్ పార్టీ సిబ్బంది తో ముమ్మరంగా జిల్లా కేంద్రంలో , పార్సెల్‌ సర్వీస్‌ కేంద్రాలు, అనుమానాస్పదంగా కనిపించే ప్రతి పార్సిల్‌, రవాణా బ్యాగుల‌ను, ప్రయాణికుల బ్యాగ్ లను తనిఖీ చేయడం జరిగింది అన్నారు.
గంజాయి, డ్రగ్స్, ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తుల రవాణాన, నియంత్రణ లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. మాధకద్రవ్యాలు రవాణా, విక్రయాలు, గంజాయి పంటలు సాగు చేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.