అకిరా హాస్పటల్ వైద్యురాలు డాక్టర్ స్వాతి
అగ్నిధారన్యూస్,సుల్తానాబాద్//కరీంనగర్:
అసలు ఏంటి ఈ డెంగ్యూ జ్వరం…
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల పట్ల జాగ్రత్తగా ఉండాలని రెండు మూడు రోజుల పాటు జ్వరం తగ్గకుంటే వైద్యున్ని సంప్రదించాలని సొంత చికిత్స చేయించుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో డెంగ్యూ వ్యాధి ఘోరంగా విస్తరిస్తుంది. డెంగ్యూ కారణంగా మరణించే సంఖ్య కూడా పెరుగుతుంది. డెంగ్యూ రోగుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని అందువల్ల డెంగ్యూ వ్యాధిని తక్కువ అంచనా వేయకూడదని కరీంనగర్ లోని అఖీరా హాస్పటల్ కు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ స్వాతి డెంగ్యూ వ్యాధి లక్షణాలు పలు జాగ్రత్తలు వహించాలని ఆమె తెలిపారు. ఆమె తెలిపిన వివరాలు ప్రకారం డెంగ్యూ వైరస్ ఎంత కాలం ఉంటుంది.? వైరస్ సోకిన దోమ ఒక వ్యక్తిని కరిచిన మూడు రోజుల తర్వాత నుండి ఐదు రోజుల వరకు డెంగ్యూ జ్వరం లక్షణాలు బయటపడతాయని ఇది మూడు రోజుల నుండి పది రోజులలో విస్తరిస్తుందని ఆమె తెలిపారు.
అసలు ఏంటి ఈ డెంగ్యూ పరిస్థితి….?
డెంగ్యూ వ్యాధిలో మూడు రకాలు ఉంటాయని అందులో ఒకటి క్లాసికల్ డెంగ్యూ,డెంగ్యూ హేమరేజికఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లు ఉన్నాయి. తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండ్ల వెనుక నొప్పి, విపరీతమైన బలహీనత, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని.. రెండోది డిటిహెచ్ ఎఫ్ పరిస్థితి ముక్కు నుంచి రక్తస్రావం, చిగుళ్ళు, మలవిసర్జన, వాంతిలో రక్తం, చర్మంపై నీలిరంగు నల్లమచ్చలు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి దీనికోసం టోర్నొకీట్ పరీక్ష జరుగుతుందని బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోతాయని, మూడో డి ఎస్ ఎస్ ఈ రకంలో సాధారణ డెంగ్యూ తో పాటు అనేక ఇతర లక్షణాలు కూడా ఉంటాయని, అధిక జ్వరం ఉన్నప్పటికీ చర్మం నల్లగా కనిపిస్తుందని రోగి క్రమంగా స్పృహ కోల్పోవడం ప్రారంభిస్తాడని పల్స్ పడిపోవడం జరుగుతుందని రక్తపోటు తగ్గడం ప్రారంభమవుతుందని డాక్టర్ స్వాతి తెలిపారు.
