అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తక్కువ కాలంలోనే అధికారుల బదిలీలకు అవకాశం ఇవ్వడంతో అధికారుల్లో ఒక ఇంత సంతోషం వ్యక్తం అవుతుంది, ఇక పెద్దపల్లి జిల్లాలోని ఒకటి,రెండు తప్ప దాదాపు అన్ని శాఖలలో పనిచేస్తున్న అధికారులకు బదిలీలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల కింద జిల్లా పరిస్థితులకు పరిపాలన సౌలభ్యానికి అనుగుణంగా మారిన ప్రభుత్వ సమీకరణల దృష్ట్యా పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న మండల పంచాయతీ అధికారులు , గ్రామపంచాయతీ కార్యదర్శులను, రెండు రోజులలో జిల్లావ్యాప్తంగా,స్థాన చలనం కల్పించి జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో, సంచలనం సృష్టించారు. అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగుల బదిలీలు మాత్రం పెద్దపల్లి జిల్లాలో 11 సంవత్సరాలుగా లేకపోవడం ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్ మారింది…. …….. 32 జిల్లాలకు ఒక రూల్ పెద్దపల్లి కి మరొక రూల్….………………. తెలంగాణలోని ముప్పై రెండు జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న వివిధ స్థాయి అధికారుల్ని ఆయా జిల్లాలలో ఒకటికి రెండుసార్లు బదిలీల ప్రక్రియ చేసినప్పటికీ పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న ఈజీఎస్ సిబ్బందిని బదిలీ చేయకపోవడంలో మతలాబు ఏంటో తెలియడం లేదు…. . డి ఆర్ డి ఓ పి డి లు మారిన మారని సిబ్బంది . ప్రజల సౌలభ్యం కోసం నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లాగా ఏర్పడిన నాటినుండి నేటి వరకు ఐదుగురు పిడీలు మారినప్పటికీ……. పెద్దపల్లి జిల్లాలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం శాఖలో పనిచేస్తున్న. 67 మంది సిబ్బంది ఏండ్ల తరబడి ఒకే కాడ తిష్ట వేసుకొని కూర్చున్నారు. టచ్ చేసి చూడు అన్నట్లు అధికారులకు సవాల్ విసిరుతున్నట్లు అనిపిస్తుంది…?…… ….ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయినా బదిలీలు తప్ప నేటికీ లేవు..…….…….. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో2013 డిసెంబర్ లో అయిన ఉద్యోగ బదిలీలు, దాదాపు నాటి నుండి నేటి వరకు పుష్కరకాలం కావస్తున్నప్పటికీ బదిలీ చేపట్టకపోవడంలో ఆంతర్యమేంటో అంతు చిక్కడం లేదు. ……………ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద విస్తీర్ణంలో 57 మండలాలు ఉన్నప్పటికీ, ప్రతి మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి బదిలీలు జరిగేవి అని ఆ శాఖలో పనిచేస్తున్న అధికారి తెలిపారు.. ప్రత్యేక జిల్లా ఏర్పడ్డాక పెద్దపల్లిలో 11 మండలాలు తోపాటు రామగిరి పాలకుర్తి కలుపుకొని అతి తక్కువ 13 మండలాలు ఉన్నప్పటికీ సిబ్బందికి 11 సంవత్సరాలు బదిలీలు లేకపోవడం ఇబ్బందికరం,బాధాకరం అని ఆ శాఖలో పనిచేస్తున్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీల ప్రక్రియ చేపడితే కలిగే బాధేంటో ఆశాఖ ఉన్నతాధికారులకే తెలియాలి మరి…. 13 మండలాలలో పనిచేసే పదిమంది ఏ పీ ఓలు, జూనియర్ ఇంజనీర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్, హెచ్ఆర్, డిపిఎంలు, మొత్తం కలిపితే దాదాపు 67 మంది జిల్లా వ్యాప్తంగా నిధులు నిర్వర్తిస్తున్నారు. వీళ్ళందరూ దాదాపు 11 సంవత్సరాలుగా బదిలీలకు దూరంగా ఉన్నారు..,. దశాబ్ద కాలంగా ఒకే చోట విధులు నిర్వర్తించడం వల్ల సహజంగానే, విధులు నిర్వహించే ప్రాంతంలో అధికారికి పరిచయాలు పెరగడం వల్ల, పలుకుబడిని ఉపయోగించుకొని ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకుల అండదండలతో ఇన్ని సంవత్సరాలుగా ఓకే కాడ పాతుకుపోయానే…? విమర్శలు వ్యక్తం అవుతున్నాయి., ఓకే మండలంలో దాదాపు పురస్కరకాలం సర్వీస్ పూర్తి చేసుకోవడంతో, అన్ని శాఖలతో పోల్చినప్పుడు సీనియర్ అధికారిగా ఇష్టానుసారం వ్యవహరించే అవకాశం లేకపోలేదు. సహజంగానే పలుకుబడి పెరగడంతో . ఆ ప్రాంతం మీద ఉన్న పట్టు వల్ల,అవినీతి అక్రమాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. ఒక ప్రభుత్వ అధికారి మూడు,నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువగా ఒకే చోట పని చేయకూడదు …అనే నిబంధనలు గ్రామీణ ఉపాధి హామీ శాఖలో.. ఉన్నప్పటికీ గత 11 సంవత్సరాల నుండి బదిలీలు కాకపోవడం లో ఆంతర్యమేంటో అంకిచికడం లేదు. పెద్దపల్లి జిల్లాగా ఏర్పడిన నుండి డి ఆర్ డి ఓ శాఖలో పనిచేసిన ఐదుగురు పీడీలు మారినప్పటికీ కింది స్థాయిలో, పనిచేస్తున్న అధికారులు బదిలీలు కాకపోవడం జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఆశాఖ జిల్లా అధికారులు దృష్టి సారించి ప్రక్షాళన చర్యలు చేపడుతారా…? పట్టించుకోకుండా వదిలేస్తారా…? చూడాలి మరి. ఏదేమైనా ఆశాఖ పైన జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి బదిలీల ప్రక్రియ చేపడితే బాగుంటుందని ప్రజలు, అధికారులు అనుకుంటున్నారు.

