అగ్నిధారన్యూస్ “( సంగారెడ్డి)” సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల్ సింగీతం ఏపీజీవిబీ బ్యాంకులో మేనేజర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రైతులు, మహిళా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇట్టి సమావేశంలో ఝరాసంగం మండల్ తుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన ఖమర్ పాషా కొన్ని రోజుల క్రితం ప్రమాద వశాత్తు ఆక్సిడెంట్ లో మరణించారు సింగీతంలో గల ఏపీజీవీబీ బ్యాంకులో బ్యాంకు అధికారుల సూచనతో ఖమర్ పాషా జనరల్ పర్సనల్ ఆక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు అ ఇన్సూరెన్స్ క్లైమ్ చేయడం ద్వారా వచ్చిన ఇరువై లక్షల(20,00,000)ఇన్సూరెన్స్ డబ్బులను నామిని అయిన తన తండ్రి శేరి షబ్బీర్ కు ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సంగారెడ్డి రీజనల్ మేనేజర్ సమత చేతుల మీదుగా ఇరువై లక్షల చెక్కును అందించారు అనంతరం రీజనల్ మేనేజర్ సమత ఆ సమావేశంలో రైతులతో మాట్లాడుతూ ప్రతి ఖాతాదారుడు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి అన్నారు ఖాతాదారుడికి ఇన్సూరెన్స్ చేపించే కృషి చేస్తే దానివల్ల ఖాతాదారుల కుటుంబాలకు మేలు చేసే వారమవుతాము అని రీజనల్ మేనేజర్ సమత అన్నారు బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ తమకు పిఎంజెజెబివై, పిఎం ఎస్ బివై అనే ఇన్సూరెన్స్ కలిగి ఉన్నారో లేదో తెలుసుకొని ఉండాలి అని అన్నారు. ప్రతి రైతు తమ పంట రుణాలను సంవత్సరం లోపు తిరిగి చెల్లించటం రెన్యువల్ చేసుకోవటం వలన ప్రభుత్వం అందించే వడ్డీ మాఫీ పొందగలరు అలాగే ఖాతా సక్రమంగా ఉంటే డిబిటి ఫెయిల్ కాకుండా ప్రభుత్వ పథకాలు పొందగలరు అని అన్నారు ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ సమత, చీఫ్ మేనేజర్ హరీష్,బ్రాంచ్ మేనేజర్ సతీష్ కుమార్, నోడల్ ఆఫీసర్ సిద్ధార్థ, ఎస్ బి ఐ జనరల్ బిడిఎంఎస్ నాగరాజు నరేష్ , ఫీల్డ్ ఆఫీసర్ రంజిత్ కుమార్ అకౌంటెంట్ రాచయ్య, ఫీల్డ్ ఆఫీసర్ కృష్ణ , క్యాషియర్ ప్రశాంత్ బాబు,గురువీర్ రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు
