పెద్దపల్లి జిల్లాలో జిల్లాలో ప్రభుత్వ టెండల ద్వారా నిర్వహిస్తున్నటువంటి ( సక్రమ ) మద్యం షాపుల దుకాణాలు దాదాపు 77 ఉండగా, ఊరురా గల్లి గల్లి కి ( అక్రమ )మద్యం దుకాణాలు దర్జాగా నెలకొన్నాయి . ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం తమకేం పట్టదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు . ప్రతి ఊరిలో 5నుండి 10కి తగ్గకుండా బెల్టు షాపుల నిర్వహణ కొనసాగుతుంది. ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియదా…? అంటే తెలుసు అనే సమాధానం వస్తుంది. ఆ శాఖ అధికారుల,అక్రమార్కుల, కనుసన్నల్లోనే గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. అనే విమర్శలు ఉన్నాయి .రాష్ట్ర ప్రభుత్వం మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని చెప్తుంటే గ్రామాలు,పట్టణాలు అనే తేడా లేకుండా యువత బెల్టు షాపుల (గొలుసు దుకాణాల) వద్ద మత్తులో ఊగుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.
అగ్నిధార స్పెషల్ రిపోర్ట్
అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా:
పెద్దపల్లి జిల్లాలో 267 గ్రామాలు ఒక కార్పొరేషన్,మూడు మున్సిపాలిటీలు, ఉన్నాయి. ఏ వార్డులో ఈ గల్లీలో చూసిన మద్యం ఏరులై పారుతుంది. ముఖ్యంగా 267 గ్రామపంచాయతీలలో, బెల్టుషాపులు లేనటువంటి గ్రామాన్ని అధికారులు చూపించగలరా,?. గతంలో సంపూర్ణ మద్యపాన నిషేధిత గ్రామంలో మద్యపానం అమ్మకాలు వైఫల్యం ఎవరిది ……? జిల్లాలో మద్యం మత్తులో చిన్న,పెద్ద ముసలి,ముదక అనే తేడా లేదు యువత మద్యం మత్తులోఊగుతూ జీవితాలు చిత్తు చేసుకుంటున్నారు. తెలిసీ తెలియని వయసులో మద్యానికి బానిసలై జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్న వాళ్ళు జిల్లాలో వేలాది మంది ఉన్నారంటే ఆశ్చర్య పడాల్సిన అవసరంలేదు. జిల్లాలో సక్రమ మద్యం దుకాణాలు 77 ( ప్రభుత్వ టెండర్ల ద్వారా నెలకొల్పినవి ) ఉండగా అక్రమ మద్యం దుకాణాలు అంచనాకు మించి “”ఎక్కడ బడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే”” అన్న చందంగా తయారైంది పెద్దపల్లి జిల్లాలో బెల్టుషాపుల నిర్వహణ, వాటిని అదుపు చేయాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు, అనే విమర్శలు ఉన్నాయి. అగ్నిధార జిల్లాలో వివిధ ప్రాంతాలలో పరిశీలించగా ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అక్రమ మద్యం షాపులు కనబడ్డాయి . మద్యం అమ్మకాల ప్రదేశాలలో గ్రీన్ మ్యాట్ కట్టి (సింబల్) మద్యం ప్రియులను మరి ఆహ్వానిస్తున్నారు.పెద్దపల్లి జిల్లాలోని267 గ్రామ పంచాయతీలు ఒక్క కార్పొరేషన్,మూడు, మున్సిపాలిటీలు,ఉండగా ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహించడం విస్మయాన్ని గురిచేస్తుంది. ఒక ఊరిలో 5 నుండి 10 కి తగ్గకుండా బెల్టుషాపుల దందా యదేచ్ఛగా కొనసాగుతుంది,అంటే వ్యాపారం ఏవిధంగా మూడు పూలు ఆరు కాయలుగా మద్యం దందా ముందుకు సాగుతుందో, చెప్పవచ్చు. మద్యం సేవించడానికి వయసుతో సంబంధం లేకుండా బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారెందరో. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఆత్మహత్యలు, అరాచకాలు, అఘాయిత్యాలకు, పాల్పడుతున్నవారు, పెడదారి పట్టేవారు,ఎందరో ఉన్నారు. మద్యం వల్ల సర్వ నాశనం అయిన కుటుంబాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి . కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతుంటే యువత బెల్ట్ షాప్ ల వద్ద మత్తులో ఊగుతున్నారు. గ్రామాలలో బెల్టు షాపుల వద్ద ముఖ్యంగా యువత,మద్యాన్ని సేవిస్తున్నారు. ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో టెండర్ల ద్వారా వైన్ షాపుల నిర్వహణ చేయడంలో లేని తప్పు, గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే తప్పెలా అవుతుందని అనుకున్నారో, ఏమో కానీ గ్రామాలలో విధి,వీధికి బెల్ట్ షాపులు వెలిచాయి. ఆ ప్రాంత యువతకి అందుబాటులో మద్యం ఉండడంచేత, చేతిలో డబ్బులు ఉన్నా లేకున్నా మద్యం తాగాలనే ధ్యాస రేకెత్తుతుంది.డబ్బులు దొరకని సమయంలో డబ్బు కోసం అక్రమ మార్గాలను అన్వేషించే వారు లేకపోలేదు. ….
.బెల్ట్ షాపుల్లో గుడుంబా దందా ... అధికారుల అండదండలు బెల్ట్ షాపుల నిర్వహకులకు ఉండడంచేత అదే అదునుగా భావించి బెల్ట్ షాపులలో గుడుంబా ప్యాకెట్లను అమ్ముతున్నారు…. పైసలు ఉంటే సీసా లేకుండా సారా అన్న చందంగా తయారయ్యాయి, బెల్ట్ షాపులు. మద్యానికి బానిసలుగా మారి గుడుంబా ప్యాకెట్లు తాగి అనారోగ్యాలకు గురై గ్రామాల్లో చనిపోతున్న వాళ్లు అనేకమంది ఉన్నారు. తరువాత కథనం ఇంకా ఉంది.


