అగ్నిధారన్యూస్,( రామగుండం)
డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లేని రెండు రెస్టారెంట్ లను రామగుండం నగర పాలక సంస్థ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఎఫ్ సి ఐ క్రాస్ రోడ్స్ లోని శాన్వీ ఫుడ్ లాంజ్ , ఎన్ టి పీ సి లోని సాoప్రదాయ రెస్టారెంట్ లు గత కొన్ని నెలలుగా చెల్లుబాటులో ఉన్న డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లేకున్నప్పటికీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం గమనించి నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీస్ లకు సదరు రెస్టారెంట్ల నిర్వాహకుల నుండి స్పందన రాకపోవడం తో కమిషనర్ ఆదేశాల మేరకు సీజ్ చేసినట్లు నగర పాలక సంస్థ హెల్త్ అసిస్టెంట్ కిరణ్ తెలిపారు.

