ఎమ్మార్పీ పై 30 నుండి 50రూపాయలు వసూల్.
యూత్ కు లిక్కర్ ముసలోళ్లకు గుడుంబా..
అన్ని దందలను మించిపోతున్న మద్యం దందా.
బెల్ట్ షాపుల నియంత్రణ ఎక్కడ...?
వైన్ షాపులను మించిపోయిన బెల్ట్ షాపులు.
పట్టించుకోని పర్యవేక్షణ అధికారులు.
అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిజిల్లా) జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ యువత టార్గెట్ చేసి అవసరమైన మద్యం బ్రాండ్లను జిల్లాలో టెండర్ల ద్వారా కేటాయించబడిన వైన్స్ ల నుండి బెల్ట్ షాపులకు,దిగుమతి చేసుకోని, వైన్ షాపులను తలపించే విధంగా గొలుసు షాపులలో అన్ని రకాల బ్రాండ్ లు ఉంచి, లిక్కర్ పై ఎమ్మార్పీ అంటే 30 రూపాయల నుండి 50 రూపాయలకు తగ్గకుండా వసూల్ చేస్తూ, నిలువు దోపిడీ చేస్తున్నారు. తాగుడుకు బానిసలుగా మారిన వాళ్లు,గత్యంతరం లేక అడిగినంత ఇచ్చి ఆర్థికంగా నష్టపోతున్నారు .యువతకు లిక్కర్ పెద్దవాళ్లకు గుడుంబా అన్నసందంగా దందా తయారైంది . ఇంత జరుగుతున్న ఆ శాఖ అధికారులకు తెలియదు అనుకుంటే పొరపాటే. ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం దుకాణాల వైపు పట్టీపట్టనట్లు,చూసీ చూడనట్టు, వ్యవహరించడంలో ఆంతర్యమేమిటో అర్థంకావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బైండోవర్లు అయినా ఆగని దందా…
జిల్లాలో అతి తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలంటే అక్రమ మట్టి దందా, భూదందా, ఇసుక దందా, రేషన్ బియ్యం, దందా ,స్క్రాప్ దందా తో పాటు ఇంకేదైనా ఉందా..? అంటే, అక్రమ మద్యం దందా అని చెప్పే స్థాయికి లిక్కర్ దందా చేరుకుంది. విషయాన్ని గ్రహించిన అనేకమంది అక్రమార్కులు అధికారుల ఉదాసిన వైఖరితో వారి అండదండతో అక్రమ లిక్కర్ దందాలోకి కొత్తగా అడుగు పెడుతున్న వారెందరో….! ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా, అక్రమ లిక్కర్ దందా, గుడుంబా వ్యాపారుల ఆగడాలు ఎక్కువ కావడం వల్ల నియంత్రించే క్రమంలో దాడులు జరిపి..? ఆయా గ్రామాల నుండి పిలుచుకొని తహసిల్దార్ల వద్ద బైండోవర్ చేస్తున్నట్లు సమాచారం. ఈవిషయమై బెల్ట్ షాప్ , నిర్వాహకులు, అమ్ముకొమ్మని అభయమిచ్చిన వాళ్లే…? బైండోవర్ల పేర్లతో భయభ్రాంతులకు గురి చేయడమేంటని చర్చించుకుంటున్నారు. అక్రమ దందా ఎక్కడెక్కడా అని… అగ్నిధార పరిశీలించగా అక్కడ,ఇక్కడనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ అన్ని ప్రాంతాలలో విచ్చలవిడిగా అక్రమ మద్యం దుకాణాలు వెలిశాయి. గ్రామీణ ,పట్టణ, ప్రధాన రహదారుల వెంట, ఇటుక బట్టీల వద్ద, కార్మిక క్షేత్రాలకు సమీపములో, ఆటో స్టాండ్ లకు దగ్గరలో, పాఠశాల అంగన్వాడి కేంద్రాలానే తేడా లేకుండా, గ్రామ పంచాయతీల పక్కన ,గ్రామంలోని ప్రధాన కూడలిల దగ్గర , కిరాణా దుకాణాల ముసుగులో మద్యం ప్రియులు కనపడకుండా మద్యం అమ్మే ప్రాంతంలో చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్టి కుర్చీలు టేబులు వేసి, మద్యంలోకి కావలసిన స్టఫ్ ఏర్పాటు చేసి మరి, బెల్ట్ షాపుల నిర్వహణ చేస్తున్నారు. జిల్లాలో కల్తీ మద్యం ఇటీవల కాలంలో పెద్దపల్లి జిల్లాలో కల్తీ మద్యం అమ్మకాలు కలకలం సృష్టించాయి. పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారుల అలసత్వంతో, నియంత్రణ లేకపోవడంచేత వారి కళ్ళు కప్పి కొందరి వైన్స్ షాపుల నిర్వాహకుల ఆగడాలకు హద్దు పద్దు లేకుండా పోయి,మద్యాన్ని కల్తీ చేస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్తీ మద్యం బెల్ట్ షాపులకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్తీ మద్యంపైన ఎక్సైజ్ శాఖ అధికారులు ఉక్కు పాదం మోపాలి.
(గత కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ తదుపరి సంచికలో)


