లబ్ధిదారులకి చెక్ అందిస్తున్న ఎమ్మెల్యే
దేశ చరిత్రలో 2 లక్షల రుణమాఫి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే.
ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు.
అగ్నిధారన్యూస్, పెద్దపల్లిజిల్లా:
మంగళవారం రోజున ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఎలిగేడు, జూలపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆర్థిక సహాయం కింద సి.ఏం సహాయక నిధి చెక్కులను పొందిన వారికి,మంగళవారం రోజున ఎలిగేడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 78 మంది లబ్ధిదారులకు 20,72,500, జూలపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు 112 మంది లబ్ధిదారులకు రూ.23,22,800 సీ.ఎం.ఆర్. ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు.జూలపల్లి ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..
ఎలిగేడు జూలపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందగా వారికి అయినటువంటి ఖర్చులను సిఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి రూ. 43,95,300/- (నలభై మూడు లక్షల తొంబై ఐదు వేల మూడు వందల రూపాయల) సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు. గత బి.అర్.ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫి పెద్ద బోగస్ అని విమర్శించారు. 5 విడుతలలో రుణమాఫి చెయ్యడంతో బ్యాంక్ లలో వడ్డీతో పాటు రైతులకు పెను బారం పడింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అయిన తర్వాత రుణమాఫీ కాలేనివారు ఎంత మంది ఉన్నారో మనకు స్పష్టత వస్తుందని రుణమాఫీ కానీ రైతన్నలు ఎవరు అధ్యైర పడవద్దని అవసరమైతే రుణమాఫీ కానీ వారి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి రుణమాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఇండ్లు లేని నిరుపేదలకు ప్రజా ప్రభుత్వంలో పక్కగా ఇండ్లు కట్టిస్తాం అని దీపావళి వరకు రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను పక్కగా అమలు చేస్తుంది అన్నారు. కొంత మంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆయ మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సి.ఎం.ఆర్.ఎఫ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


