Oplus_0

ఉన్నత విద్య విధానం ప్రభుత్వ చేయూత పైన అవగాహన.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా:
బుధవారం రోజు మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పెద్దపల్లి టౌన్ లోని శ్రీ చైతన్య వోకేషనల్ కళాశాలలో ఉన్నత విద్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్షిప్ పైన అవగాహన కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్య్రమాన్ని ఉద్దేశించి జిల్లా మహిళా సాధికారత కేంద్రo కో…ఆర్డినేటర్ దయా అరుణ మాట్లాడుతూ… మారుతున్న కాలంతో పాటు ఉన్నత విద్యలో వస్తున్న మార్పులు, ప్రభుత్వ స్కాలర్షిప్ ప్రాముఖ్యత, చదువుకు డబ్బు ఎప్పుడు సమస్య కాదని, ప్రభుత్వం చాల రకాలుగా స్కాలర్షిప్ లు అందింస్తుంది ప్రోత్సహిస్తుందన్నారు. మహిళలలో ఆరోగ్యపరంగా వచ్చే రకరకాల వ్యాదులు….,రుతు క్రమం పరిశుభ్రత, గురించి
మహిళా సాధికారత నేపథ్యం గురించి విద్యార్థులకు తెలిపారు. అలాగే జెండర్ స్పెషలిస్టులు జే. సుచరిత సీ.హెచ్. స్వప్న మాట్లాడుతూ... లింగ వివక్షత, లింగ నిర్దారణ, టోల్ ఫ్రీ నెంబర్లు, సైబర్ నేరాల గురించి వివరించారు. స్పెషలిస్టు ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ ఎస్. సంధ్య రాణి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు వాటి ఆచరణ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర శేఖర్ ,వైస్ ప్రిన్సిపాల్ మహేందర్,అధ్యాపకులు సుదీర్, మనోజ్,రవి, క్రిష్ణవేణి, విద్యార్థులు పాల్గొన్నారు.