మహిళా శక్తి గ్రౌండింగ్ వేగవంతం చేయాలి.

స్వశక్తి మహిళా సంఘాల ఎన్.పి.ఏ లను 1 శాతానికి తగ్గించాలి.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, ఆగస్టు-07:

మహిళా శక్తి కార్యక్రమం క్రింద రూపొందించిన 12 రకాల మాడ్యుల్స్ యూనిట్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మహిళా శక్తి కార్యక్రమం అమలు పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ

మహిళా శక్తి కార్యక్రమం క్రింద పాడి పశువుల, కోళ్ళ ఫారం, ఆహార శుద్ది కేంద్రాలు, మైక్రో ఎంటర్ప్రైజెస్ మొదలైన 12 రకాల మాడ్యుల్స్ లో రూపొందించిన వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్ కు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.మన పెద్దపల్లి జిల్లాలోని మహిళా సంఘాలు మొత్తం ఏ గ్రేడింగ్ లో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఏపిఎం లు రెగ్యులర్ గా మండల సమాఖ్య సమావేశాలు నిర్వహించే మహిళా సంఘాల పనితీరు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.మహిళా సంఘాలకు అందించే స్వశక్తి రుణాల మొత్తం 15 నుంచి 20 లక్షలు ఉండాలని, అప్పుడే మహిళలు వ్యాపార యూనిట్లు ప్రారంభించేందుకు ఉపయోగపడతాయని, క్వాంటం ఆఫ్ రుణాల పంపిణీ పెంచాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు.స్వశక్తి మహిళా సంఘాల మొండి బకాయిల వసూలు పై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రస్తుతం మన జిల్లాలో 1.9 శాతం మహిళా సంఘాల రుణాల ఎన్.పి.ఏ ఉందని, దీనిని 1 శాతానికి తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సంబంధిత మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి రుణాలు చెల్లించేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.రాబోయే రెండు మూడు నెలల్లో పీఎం స్వానిధి రుణాల రికవరీ 90% మేర పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారుజిల్లా వ్యాప్తంగా ఒకేసారి మహిళా శక్తి కార్యక్రమం అమలు చేయడం కంటే ముందుగా ఒక పైలట్ మండలాన్ని ఎంపిక చేసుకొని, అందులో నిర్దేశిత వ్యాపార యూనిట్ల ఏర్పాటు చేయాలని, ఇందులో నుంచి వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన మండలాల్లో మహిళా శక్తి కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు చేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.మహిళా శక్తి కార్యక్రమం క్రింద వివిధ వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడిని సంబంధిత మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా రుణాలు అందజేయాలని కలెక్టర్ లీడ్ బ్యాంకు మేనేజర్ ను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రవీందర్, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేష్, అదనపు డిఆర్డిఓ, ఏపిఎం లు, మెప్మా సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.