డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తికి మరో గౌరవ డాక్టరేట్
అగ్నిధారన్యూస్ ఖమ్మం
ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన డా.గుగ్గిళ్ల దివ్యమూర్తికి మరొక గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ డాక్టరేట్ ను జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీవారు దివ్యమూర్తికి అందజేశారు. తనకు ఉన్నటువంటి విద్యా సామర్థ్యాన్ని బట్టి, పరిజ్ఞానాన్ని బట్టి డాక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనగా విద్యారంగంలో దివ్యమూర్తికి ఈ డాక్టరేట్ ను అందజేయడం జరిగింది. మెడల్ తో పాటు సర్టిఫికెట్, సీల్డ్ ను అందజేశారు. ఈ డాక్టరేట్ ను పుదుచ్చేరిలోని సెన్బాగా కన్వెన్షన్ సెంటర్లో దివ్యమూర్తి తీసుకోవడం జరిగింది. తనకు గౌరవ డాక్టరేట్ రావడం ఇది రెండో సారి అని దివ్యమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తనకు 42 అవార్డులు వచ్చాయని దివ్యమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన వ్యాపారవేత్త గుండేటి నాగరాజు, డా. యు వి రత్నం, కర్ణాటక ప్రముఖ ఫిలిం ప్రొడ్యూసర్ అశ్వద్ధామ, తదితరులు పాల్గొన్నారు.
