*జిల్లాలో గొర్రెల,మేకల మార్కెట్ యార్డ్ లు ప్రారంభించాలి.

*కేటాయించిన భూములకు ఆర్డర్ ఇవ్వాలి.

*యాదవులు, కురుమలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

*అభివృద్ధి సంక్షేమంలో భాగస్వామ్యం చేయాలి.

*సంఘం నాయకులు మారం తిరుపతి యాదవ్.

               అగ్నిధారన్యూస్, పెద్దపల్లి:
శుక్రవారం రోజు తెలంగాణ రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షని కలిసి పెద్దపల్లి జిల్లాలో యాదవ, కురుమ కులస్తులు జిల్లాలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. గొర్రెల కాపరుల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు. అంతకుముందు బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిపి మండల్ చిత్రపట జ్ఞాపకను అందించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ దృష్టికి పలు అంశాలపై సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందించారు. పెద్దపల్లి జిల్లాల్లో గతంలో ఐదు మార్కెట్లను సర్వే చేసి ప్రభుత్వ భూమిని కేటాయించారన్నారు, జిల్లా పశువైద్యాధికారికి గత కలెక్టర్ లేఖ రాశారని గుర్తు చేశారు. దాని కనుగుణంగా గొర్రెల,మేకల మార్కెట్లకు ఆర్డర్ కాపీని జిల్లా పశు సంవర్థక శాఖ పేరు మీద అందించాలని కోరారు, అలాగే ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తూ.. జిల్లా యూనియన్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23 తేదీన గొర్రెల కాపరులకు అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామని, ఆసందర్భంగా సహకార శాఖ అధికారులను,పశు సంవర్ధకశాఖ అధికారులను భాగస్వామ్యం చేసి సమావేశానికి హాజరయ్యేలా చూడాలని, తద్వారా ప్రాథమిక గొర్రెల సహకార సంఘం సభ్యులకు, ఆ శాఖ ద్వారా చేపట్టిన, చేపట్టబోతున్న అభివృద్ధి, సంక్షేమ విషయాల పైన అవగాహన కల్పించడం ద్వారా… సంఘ సభ్యులు సంఘ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామంలో కేటాయించిన, పెద్దపల్లి జిల్లా గొర్రెల మేకల మార్కెట్ యార్డ్ గతంలో నిధులు కేటాయించడం జరిగింది అన్నారు . ఆనిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయనందున వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి, అభ్యున్నతికే ఖర్చు చేస్తూ, గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలను భాగస్వామ్యం చేస్తూ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తిరుపతి యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సలేంద్ర రాముల యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల నరసయ్య యాదవ్, పెద్దపల్లి మండల అధ్యక్షుడు దాడి చంద్రమౌళి యాదవ్, నాయకులు పర్శ సమ్మయ్య యాదవ్ తదితరులు కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు.