అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సుల్తానాబాద్ పట్టణంలోనీ తెలంగాణ చౌరస్తా వద్ద రైతులతో కలిసి ట్రాక్టర్ పై ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్ లో హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపించారని అన్నారు.కృతజ్ఞతగా మండల కేంద్రంలో రైతులతో కలిసి ఘనంగా ర్యాలీ నిర్వహించామని అన్నారు.గత ప్రభుత్వాలు చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని కొంత మంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాకపోతే వాటిని కూడా తొందరలోనే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండల రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు మినుపాల ప్రకాష్ రావు, దన్నాయక్ దామోదర్ రావు, చిలుక సతీష్, అంతటీఅన్నయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.