మంథని ప్రధాన చౌరస్తాలో ప్ల కార్డులతో నిరసన.
– మంథని ఆసుపత్రి సూపరిండెంట్ పై చర్య తీసుకోవాలని డిమాండ్.
– మంథని ఆర్డిఓ, ఏవో కు వినతి పత్రం.
అగ్నిధారన్యూస్ మంథని :
మంథని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు సభ్యులు మంథని ప్రధాన చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ప్రదర్శనగా ఆర్డీవో కార్యాలయం చేరుకుని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డిఓ, ఏవో తూము రవీందర్ కు వినతిపత్రం అందజేశారు.మంథని సామాజిక ప్రభుత్వ వైద్యశాల లో ఆగస్టు 15న అమానవీయ సంఘటన చోటుచేసుకుంది.ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగ పని చేస్తున్న విష్ణు భక్తుల పూర్ణిమతో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాజశేఖర్ బూట్లు తూడిపించుకున్నాడని.ఈ చర్యతో పూర్ణిమ మానసిక క్షోభకు గురైంది.ఈ సంఘటనపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పూర్ణిమతో బూట్లు తుడిపించుకున్న ఆస్పత్రి సూపరిండెంట్ పై చర్యలు తీసుకోవాలని సంఘాలు విష్ణు భక్తుల పూర్ణిమా కులానికి చెందిన నాయి బ్రాహ్మణులు జిల్లా కలెక్టర్ కు ఈనెల 16న ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మంథని సురేష్,మంథని లక్ష్మణ్, మంథని వేణు, మంథని మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్, సిఐటియు నాయకులు బూడిద గణేష్, ఆర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

