నివాళులర్పించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు.

అగ్నిధార న్యూస్ మంథని :

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గుమ్మునూరు (లక్ష్మీపురం) మాజీ సర్పంచ్ బందెల రామస్వామి బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామస్వామి మొదటి నుంచి చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే శ్రీధర్ బాబుకు విధేయుడిగా ఉన్నారు. ఆయనకు భార్య (గుమ్మునూరు తాజా మాజీ సర్పంచ్) కూతురు, కుమారుడు ఉన్నారు. రామస్వామి మరణంతో లక్ష్మిపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందిన వెంటనే మంథనిలో ఉన్న ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు హుటాహుటిన బయలుదేరి వెళ్లి రామస్వామి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించి ఓదార్చారు. రామస్వామి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం పవిత్ర గోదావరి నది తీరాన రామస్వామి అంత్యక్రియలు జరిగాయి.