గత 15 ఏళ్లుగా నిరీక్షిస్తున్నప్పటికీ నెరవేరనున్న చిరకాల కోరిక.

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:
సుల్తానాబాద్ వైశ్య భవనంలో ప్రెస్ క్లబ్ సన్నాహ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సభ్యత నమోదుకు సభ్యత అడ్ హాక్ ఆడకకమిటీ కన్వీనర్ గా పెగడ చందు, కో కన్వీనర్లుగా బోయిని వినోద్ ,మంద శ్రీనివాస్ వ్యవహరించనున్నామని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తుండగా నిరీక్షిస్తున్న పాత్రికేయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈనెల 28 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు సేకరణ చేసుకునే అవకాశాన్ని ,మెజార్టీ సభ్యులు తీర్మానంను చేసి ఆమోదం తెలిపారు. వివిధ దిన పత్రికలలో పనిచేస్తున్న ప్రతి సభ్యుడు దరఖాస్తులను ఆడ్ హాక్ కమిటీ కన్వీనర్లకు అందివ్వాలని , శుక్రవారం ప్రెస్ క్లబ్ ఎన్నికల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి సభ్యుని వివరాలను సీనియర్ జర్నలిస్టులు పరిశీలన చేసి ఆమోదం తెలిపిన తర్వాత లిస్టును ప్రిపేర్ చేసి ఎన్నికల అధికారికి అందజేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అడ్డగుంట రాజేందర్ ,భైరవని రవీందర్ గౌడ్, పెడడా మధు, మంద నాగార్జున, సుంక మహేష్, బుర్ర ఓంకార్ గౌడ్ ,దాసోహం గోపికృష్ణ, చొప్పరి సుమన్, బొల్లి సత్యనారాయణ ,టి.సరళ- సంజయ్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.