– మంథని మునిసిపల్ అధికారుల కొరడా..!
అగ్నిధారన్యూస్ మంథని :
పెద్దపల్లి జిల్లా మంథని నగరపాలక సంస్థ అధికా రులు అక్రమ నిర్మాణాలపై ఆదివారం ఉదయం కొరడా ఝలుపించారు.
ఆక్రమించుకొని నిర్మించిన పందిరీల కూల్చివేత :
మంథని పట్టణంలోని బస్టాండ్ ఏరియా నుండి శ్రీపాద చౌకు చౌరస్తా వరకు తెల్లవారుజాము నుంచి అనేక నాటకీయ పరిణామాల మధ్య అక్రమ కట్టడాలను మంథని మునిసిపల్ కమిషనర్ జి.మల్లికార్జున స్వామి పర్యవేక్షణలో కూల్చివేతల పర్వం కొనసాగింది.మునిసిపల్ సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్డుకి ఆక్రమించుకొని ఉన్న ఫ్లెక్సీలు, నేమ్స్ బోర్డ్, హోటల్, ఫ్రూట్ షాప్ ల ముందు నిర్మించిన పందిరీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు.
ప్రమాదాల నివారణ , ట్రాఫిక్ సమస్య దృష్ట్యా :
రోడ్డుకు ఇరువైపులా షాపుల ముందు పందిరీలు వేయడంతో రోడ్లపై నడిచే వాహన దారులకు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, ముందు జాగ్రత్తగా ఈ అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది.
