స్మశాన వాటికకు గ్రహణం…
తూతూ మంత్రంగా స్నానాల వాటిక నిర్మాణ..
చెట్ల పొదలతో నిండిపోయిన పాత రహదారి.
కనీసం నీటి సౌకర్యం కూడా లేని దుస్థితి.
ఇప్పటికైనా అధికారులు స్పందించేనా..?
అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:
సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల స్మశాన వాటికకు గ్రహణం పట్టింది. గత కొన్ని సంవత్సరాలుగా కనీస సౌకర్యాలు లేక ప్రజలు నాన నరక యాతన అనుభవిస్తున్నారు. చెరువు కట్ట నుండి పాత రహదారి ఉన్న చెట్ల పొదలతో నడవడానికి కూడా వీలు లేకపోవడంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూసాల పరిధిలో దాదాపు 40 రైసుమిల్లుల ఆదాయం గ్రామపంచాయతీకి,వస్తున్న అభివృద్ధి మాత్రం శూన్యమని ప్రజలు అంటున్నారు. ఎవరైనా మరణిస్తే కనీసం నడవడానికి కూడా రహదారిలేని దీనస్థితి. గతంలో స్నానాల వాటిక బాత్రూంలు తూతూ మంత్రంగా నాసిరకం నిర్మాణాలు చేసిన పిచ్చి మొక్కలతో నిండిపోయి స్నానాల వాటిక వాడుకునే పరిస్థితి లేదు. దహన సంస్కారాలు తర్వాత కనీసం స్నానం చేద్దామంటే నీటి సౌకర్యం లేక ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి ఉన్నప్పటికీ సంబంధిత మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ స్మశాన వాటికను పట్టించుకోని కనీస సౌకర్యాలు కల్పించిన పరిస్థితి లేదు. ప్రభుత్వం గ్రామాలలో లక్షలాది రూపాయలు వెచ్చించి సుందరంగా స్మశాన వాటికలు నిర్మాణం చేస్తున్న తరుణంలో పూసల గ్రామ ప్రజలకు స్మశాన వాటిక శాపంగా మారింది. రెండు సంవత్సరాలుగా స్మశాన వాటికకు కనీస సౌకర్యాలు లేక నడవడానికి వీలు లేకున్నా ఇప్పటివరకు అధికారులు ప్రజా ప్రతినిధులు ఎందుకు పట్టించుకుంటలేరన్నదీన పరిస్థితి ఉన్నప్పటికీ గ్రామపంచాయతీకి ఆదాయం ఉన్న స్మశాన వాటిక అభివృద్ధి చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని పూసాల గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిధులు మంజూరైన నిరుపయోగంగా మారడంతో,స్నానాల వాటిక నిర్మాణంపై విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. నాసిరకం నిర్మాణాలతో సంబంధిత కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్ముకు కావడంతో నిర్మాణాలు కుంటుపడి ప్రజలకు నిరుపయోగంగా మారుతున్నాయని ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టర్ పై పర్యవేక్షణ అధికారులపై చర్యలు తీసుకోవాలని పూసాల గ్రామ ప్రజలు డిమాండ్. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు పూసాల స్మశాన వాటిక నిర్మాణంపై దృష్టి సారించాలని గ్రామానికి చెందిన అన్ని వర్గాల ప్రజలు ఆందోళనచేయడానికి వెనుకాడేది లేదని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అటువైపు దృష్టి సారిస్తారో లేదో చూడాలి మరి.


