గ్రామాన్ని జల్లడ పట్టిన పోలీసులు.

ప్రజల భద్రత కోసమే తనిఖీలు.

మద్యానికి,మత్తుకు దూరంగా ఉండాలి.

ధ్రువ పత్రాలు లేని ద్విచక్ర వాహనాల గుర్తింపు.

మంథని సి ఐ బి.రాజు.

అగ్నిధారన్యూస్ మంథని :
మంథని మండలం గుంజపడుగు గ్రామంలో శనివారం పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు.గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి, గ్రామంలోని స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి చాలా మందికి ఫైన్ వేశారు. యువత గంజాయి ఇతర మతపదార్థాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వివరించారు. రామగుండం కమిషనర్ శ్రీనివాసు ఆదేశానుసారం కార్టన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని మంథని సి ఐ బి.రాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంథని ఎస్ ఐ డి. రమేష్, రామగిరి ఎస్ ఐ చంద్రకుమార్, ముత్తారం ఎస్ ఐ నరేష్, పాల్గొన్నారు.