ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

సహకరించిన ఎమ్మెల్యే విజయ రమణారావు.

కృతజ్ఞతలు తెలిపిన చైర్ పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్, డైరెక్టర్లు.

అగ్నిధారన్యూస్,పెద్దపల్లి: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా, ఈర్ల స్వరూప సురేందర్,ను నియమిస్తూ శుక్రవారం రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్ పర్సన్స్ తో పాటు వైస్ చైర్మన్ డైరెక్టర్ ల నియామక ఉత్తరాలు జారీ చేసింది. ఆ వివరాలు
కూర మల్లా రెడ్డి, (వైస్ చైర్మన్)/( కాసులపల్లి),
డైరెక్టర్ సోమ చంద్రయ్య, (రాగినేడు)మాదగోని శ్రీనివాస్, (గుర్రాంపల్లి) కొలిపాక కనకయ్య (కనగర్తి) వేగొళపు పెద్ద రాజేశం, (తుర్కల మద్దికుంట) పిట్టల కొమురయ్య,(పిట్టల ఎల్లయ్యపల్లి/ కంగర్తి) గౌసేమియా, (అందుగులపల్లి)
గోపతి సదానందం, (ఓదెల), కొల్లూరి రాంచంద్రం, (కొలనూరు), తిప్పరపు ప్రభాకర్, (గూడెం) సరోత్తం రెడ్డి, (పెద్ద బొంకూర్) ఎడ్ల మహేందర్, (పెద్దపల్లి) తమ నియామకానికి అన్ని విధాల సహకరించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు కు చైర్ పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్, మార్కెట్ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈర్ల స్వరూప, సురేందర్ మాట్లాడుతూ… తనపై ఎంతో నమ్మకంతో అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఆశయాలకు అనుగుణంగా ఆయన మార్గదర్శకత్వంలో, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధితో పాటు, రైతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు.