అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ పట్టణంలోని వారాహి ఫ్యామిలీ రెస్టారెంట్ ఆధ్వర్యంలో రేగడిమద్దికుంట గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో దసరా సెలవుల సందర్భంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారాహి రెస్టారెంట్ యజమాని గుజ్జ విజయ్ రావు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ రావు మాట్లాడుతూ.. గ్రామస్థాయి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు 15 రోజులపాటు క్రికెట్ క్రీడా సంబరాలు కొనసాగుతాయని చివరి రోజున గెలుపొందిన అభ్యర్థులకు మొదటి బహుమతిగా పదివేల రూపాయలు, రెండవ బహుమతిగా 5000 రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాభిమానులు ఒజ్జసతీష్, జూపల్లి తిరుమల్ రావు, కంకటి నరేష్, ఆర్గనైజర్లు సాయి కృష్ణ, అలీమ్, వసీం తదితరులు పాల్గొన్నారు.
