అగ్నిధారన్యూస్ మంచిర్యాల
సామాన్యుల గుండెచప్పుడు కాకా అని కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా పార్లమెంటు సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో దివంగత నేత కాక జయంతి వేడుకలను మంచిర్యాలలోని ఎంపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు 50 మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి, మరో వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన సేవలను గుర్తుచేస్తూ సోషల్ వారియర్స్, కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతూ..
దళిత నేతగా కాకా అంచెలంచెలుగా దేశం గర్వించే నాయకుడిగా ఎదిగారని హైదరాబాద్లో వేలాది మంది పేదల కోసం భూపోరాటం చేసి ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత కాకాదేననిఅందుకే ఆయనను గుడిసెల వెంకటస్వామి అని కూడా పిలుస్తారనీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లోనూ నిర్విరామంగా తన తుది శ్వాస వరకు ఉద్యమాలే ఊపిరిగా పోరాడిన యోధుడని గల్లీ నుంచి ఢిల్లీ వరకు అలుపెరుగని నిర్వార్థ రాజకీయ నాయకుడనిదేశ వ్యాప్తంగా 101 కార్మిక సంఘాలకు కాకా నాయకత్వం వహించారు. బీఐఎఫ్ఆర్ నుంచి సింగరేణి సంస్థను కాపాడటంతో పాటు లక్ష మంది కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించిన గొప్ప లీడర్ కాకాసింగరేణికి ఆర్థికంగా కేంద్రం నుంచి అప్పుడు రూ.1100 కోట్ల వరకు ఇప్పించారు. దేశంలో పెన్షన్ స్కీంను తీసుకవచ్చి కార్మికవర్గానికి అండగా నిలిచిన మన కాకా వెంకటస్వామి అని కొనియాడారు.

