విద్యార్థిని అభినందించిన పాఠశాల కరస్పాండెంట్  ఎర్రోజు మోహన్ రాజ.

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి, అక్టోబర్05:

హనుమకొండలో ఈనెల 7న జరగబోయే రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు పెద్దకల్వల నోబెల్ పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు. ఎన్టిపిసి మైదానంలో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి 6వందల మీటర్ల పరుగుపందెం పోటీల్లో అద్బుత ప్రతిభతో రాణించిన అస్మిత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికైన అస్మిత్ ను పాఠశాల కరెస్పాండెంట్ ఎర్రోజు మోహన్ రాజ, ప్రిన్సిపల్ ప్రణీత, వ్యాయామ ఉపాధ్యాయుడు ఈర్ల సురేష్, రమేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.