అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సిఎంఆర్ ధాన్యం దిగుమతి విషయములో మిల్లర్ల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సుల్తానాబాద్ రైస్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు మోరపల్లి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఆయా రైస్ మిల్లుల యజమానులు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైస్ మిల్ మిల్లర్ల అధ్యక్షుడు మాట్లాడుతూ.. సన్నరక ధాన్యం 67% అవుటన్ రానందున టెస్ట్ మిల్లింగ్ చేసి ఫైనల్ ఓ టి ఆర్ చేయాలని, సన్నధాన్యం రా రైస్ చేయుటకు 17 ఎంసి ధాన్యం సేకరిస్తే నిలువ ఉండక చెడు వాసన వస్తుందని కావున 14% ఎం సి ధాన్యాన్ని మిల్లర్లకు సరఫరా చేయాలని, పాత బార్ధన్ ఎక్కువ డ్యామేజీ ఉండడం వలన తొమ్మిది రూపాయలకే మిల్లర్లకు ఇవ్వాలని లేదా వాపస్ తీసుకోవాలని లేనియెడల బియ్యం పురుగు వచ్చి పాసింగ్ కు ఇబ్బంది అవుతుందని, ప్రస్తుత పరిస్థితులలో మిల్లర్ల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని దీంతో బ్యాంకులు బ్యాంకు గ్యారంటీ ఇవ్వరని దీంతో చేసేదేం లేక ప్రభుత్వానికి బ్యాంకు గ్యారంటీ ఇచ్చే పరిస్థితిలో మిల్లర్లు లేరని అన్నారు. మిల్లులకు వచ్చే దాన్యం తప్పనిసరి పంపించాలని, ఏసీకే పాస్ అయిన తర్వాత బి ఆర్ ఐ చేసినచో మిల్లర్లకు సంబంధం ఉండకూడదని అలాగే రైస్ మిల్లుల అనేక సమస్యలు వివరించినట్లు ఆయన తెలిపారు.
