*చెత్త పన్ను చెల్లించిన తప్పని తిప్పలు*

*సామాజిక స్పృహ లేని ప్రజలు*

*బాధ్యతారహిత్యమైన అధికారులు.*

*పట్టుదలతో పని చేయని ప్రజా ప్రతినిధులు.*

( అగ్నిధార స్పెషల్ స్టోరీ )

అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా

వనపర్తి మున్సిపల్ పరిధిలో శ్రీనివాసపురం, మర్రికుంట,పెబ్బేర్ రోడ్డు,గోపాల్పేట్ రోడ్డు, పాలిటెక్నిక్ ఆవరణము, పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ పీర్లగుట్ట పలు ప్రాంతాలు కాలుష్యం చెత్త సేకరణ సరిగా లేదు కుళ్ళిన వాసన కుక్కల మలమూత్ర విసర్జాలు, బాటసారులు, నివాస ప్రాంతంలోని ప్రజలు, దుర్గంధ వాసనను భరించలేకపోతున్నారు. కోర్ట్ ఆవరణలో సైతం చెత్త నిర్వహణ సరిగా లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పోలీస్ క్వార్టర్స్ , ఎమ్మెల్యే ఇంటికి వెళ్లే దారి, జడ్జిలు ఉండే నివాస ప్రాంతంలో చెత్త సేకరణ నిర్వహణ సక్రమంగా లేదంటే ఇక స్లమ్ ఏరియాలో పరిస్థితి ఏంటో ఒకసారి మనము ఊహించుకోవచ్చు.నెలనెలా చెత్త పన్ను చెల్లిస్తున్న కూడా నిర్వహణ సరిగా లేకపోవడం క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం బాగా కనబడుతుంది తెలుస్తుంది. నల్లా బిల్లులు హౌస్ టాక్స్ లు వసూలు చేయడానికి పదుల సంఖ్యలో అధికారులు వస్తారు, కానీ, కింది స్థాయి ఉద్యోగులు పనిచేస్తున్నారా లేదా అని చూసుకోవడానికి అధికారులు ఏనాడు కూడా సరైన పరివేక్షణ లేదని కనబడుతుంది.నెల నెల పన్నులు తీసుకుంటున్నప్పటికీ, పర్యవేక్షణ కరువైందని పట్టణవాసుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటల్ నిర్వాహణ, పలు కాలనీలో బహిర్గత మల విసర్జన చేయడం, ప్రభుత్వ  ప్రైవేటు వ్యవస్థలలో, పరిశుభ్రత బోర్డులు, లేకపోవడంవలన, ప్రజలు బాధ్యతాయుతంగా ఉండకపోవడం, ఆరోగ్య అలవాట్ల పైన సరైన అవగాహన కల్పించలేకపోవడం, వాటి పైన ప్రభుత్వ యంత్రాంగం మరియు, మేధావి వర్గం కూడా విఫలమైందని చెప్పవచ్చు.వ్యర్థ పదార్థాలను కాల్చడం మూలంగా, రోడ్డుపక్కలనే చెత్తను కొన్నిసార్లు డంపు చేయడం వాటి నుంచి వచ్చే దుర్వాసనల వలన వ్యాధులకు గురవుతున్నారని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో తప్ప మిగతా ప్రాంతాలలో, శుభ్రపరచడం కానీ శానిటేషన్ కాని చేయటం లేదని, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్లాస్టిక్కవర్లు, కాళీ వాటర్ బాటిల్లు, మద్యం సీసాలు, రోడ్లకు ఇరుపక్కలగా కళ్ళకు కనపడుతుంటే, జిల్లా పరిధిలో ఇంత మంది అధికారులు, చూసి చూడనట్లు వెళ్తున్నప్పుడు, మేము సామాన్యులము ఏమి చేయగలము అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు….ఇలా చెబుతూ పోతే ఒకటి ఏంటి హోటల్లు, షాపింగ్ మాల్స్, కళాశాలలో, పాఠశాలలో, డ్రైనేజీలు, వీధిలైట్లు నిర్వహణ సరిగా లేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, పెద్ద పెద్ద హోటల్లో సైతం, పబ్లిక్ ప్లేసులు, పార్కులు పలు ప్రాంతాలలో మరుగుదొడ్లు సరిగా లేవు ఉన్న సరైన నిర్వహణ లేదు వీటన్నింటిపైనా పర్యవేక్షణ అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తే బాగుంటుందని మరియు ప్రతి పౌరుడు బాధ్యతగా క్రమశిక్షణతో ప్రభుత్వ స్థలాలను అసాంఘిక కార్యకలాపాల కు కాకుండా బాధ్యతాయుతంగా వాడుకొని తమ వంతుగా శుభ్రతను పాటించాలని, అలా పాటించడానికి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే బాధ్యత ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.